మమత సహా 22 మంది మంత్రులు అవుట్
ABN , Publish Date - May 06 , 2026 | 06:37 AM
మమతా బెనర్జీ క్యాబినెట్‌లో 35 మంది మంత్రులు ఉండగా.. ఆమెతో పాటు 22 మంది మంత్రులు తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆమె ప్రభుత్వంపై...
కోల్‌కతా, మే 5: మమతా బెనర్జీ క్యాబినెట్‌లో 35 మంది మంత్రులు ఉండగా.. ఆమెతో పాటు 22 మంది మంత్రులు తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆమె ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మమత (భవానీపూర్), అరూప్ బిశ్వాస్ (టోలీగంజ్), బ్రత్య బసు (డమ్‌డమ్), చంద్రిమ భట్టాచార్య (డమ్‌డమ్ ఉత్తర్), శశి పాంజా (శ్యామ్‌పుకుర్), సుజిత్ బోస్ (బిధాన్‌నగర్), ఇంద్రనీల్ సేన్ (చందన్‌నగర్), బేచరమ్ మన్నా (సింగూర్), స్వపన్ దేబ్‌నాథ్ (పూర్బస్థలి దక్షిణ్), బులూచిక్ బరాయక్ (మాల్), ప్రదీప్ కె.మజుందార్ (దుర్గాపూర్ పూర్బ), బీర్బహ హంస్‌దా (బీన్‌పూర్), మానసరంజన్ భునియా (సాబంగ్), మలయ్ ఘాతక్ (అసన్‌సోల్ ఉత్తర్), సిదికుల్లా చౌధురి (మోంటేశ్వర్), ఉదయన్ గుహ (దిన్హత), బంకించంద్ర హజ్రా (సాగర్), సంఽధ్యారాణి టుడు (మన్‌బజార్), ఉజ్వల్ బిశ్వాస్ (కృష్ణనగర్), స్నేహశీశ్ చక్రవర్తి (జాంగిపారా), శ్రీకాంత్ మహతో (సల్బోని), సత్యజిత్ బర్మన్ (హెమ్టాబాద్).. బీజేపీ అభ్యర్థుల చేతుల్లో పరాజయంపాలయ్యారు. ఈ మంత్రుల్లో అత్యధికులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. ఇక, రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకు గాను 9 జిల్లాల్లో టీఎంసీ ఖాతాయే తెరవలేదు. ఈ 9 జిల్లాలు.. పూర్వ మేదినీపూర్, పురూలియా, బంకురా, జార్గ్రమ్, డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్‌గురి, ఆలీపురద్వార్, పశ్చిమ బర్ధమాన్‌ల్లోని మొత్తం 68 స్థానాలనూ బీజేపీయే గెలుచుకోవడం మరో విశేషం.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్