బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ లు విష నాగులు: ఖర్గే
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:05 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ లు విష నాగులని, వాటిని చంపేయాలని...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ లు విష నాగులని, వాటిని చంపేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ నేతలు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోంలోని నీలంబజార్‌లో నిర్వహించిన సభలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం... నమాజ్ చేసే సమయంలోనైనా విష నాగు కనిపిస్తే నమాజ్ ఆపి.. చంపాలని ఉందని పేర్కొన్నారు. లేదంటే మనుగడ ఉండదని చెప్పారు. ఇక్కడ ఆ విష నాగులు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ లేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. బీజేపీ వారిని చంపాలని ముస్లింలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఇండియన్ జిహాదీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..