అనారోగ్యంతో ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత..
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:47 PM
గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ సీరియల్ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 41 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మలయాళ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ సీరియల్ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 41 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు. వేణుగోపాల్ మరణంతో ఆయన ఫ్యాన్స్, తోటి నటీనటుటు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాల్ మరణాన్ని ప్రముఖ మలయాళ నటి సీమా జీ నాయర్ ధ్రువీకరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ...
‘నమ్మకాలన్నీ వీగిపోయాయి. బాధ తెలియని ప్రపంచానికి ప్రముఖ సీరియల్ నటుడు సిద్ధార్థ్ వెళ్లిపోయాడు. గత రెండేళ్ల నుంచి నేను నీకోసం పోరాడుతున్నాను. నా శరీరం, మనసు సహకరించకపోయినా కూడా నీ కోసం పోరాడాను. నీ ప్రాణాలు తిరిగి తీసుకురావటం కోసం పరుగులు తీశాను. నువ్వు ఇకపై కష్టపడకూడదని ఈ రోజు దేవుడు భావించాడు. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను. కన్నీళ్లు ఆగటం లేదు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. సిద్ధార్థ్ మృతిపై ప్రముఖ నటుడు కిశోర్ సత్య సంతాపం తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మరో నటుడు చాలా తొందరగా వెళ్లిపోయాడు. టీవీ సీరియల్స్ చూసే వారికి సిద్ధార్థ్ వేణుగోపాల్ తెలిసే ఉంటాడు. గత కొంతకాలం నుంచి అతడు క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నాడు. మనం ఎంతగానో గౌరవించే సీమా జీ నాయర్ అతడి బాగోగులు చూసుకున్నారు. సిద్ధార్థ్ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీమా జీ నాయర్ గొప్ప మనసుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
‘సర్పంచ్’కి అర్థం తెలియక అయోమయంగా అనిపించేది: శ్రేయస్ అయ్యర్
ఆ విషయాన్ని సీఎం రేవంత్ ముందే ప్రకటించారు: వేముల వీరేశం