మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:42 AM
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఆదివారం కల్తీ మద్యం తాగిన 12 మంది మృతి చెందారు
సాగర్(మధ్యప్రదేశ్), సెప్టెంబరు 6: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఆదివారం కల్తీ మద్యం తాగిన 12 మంది మృతి చెందారు. 54 మంది అస్వస్థత పాలయ్యారు. ఈ మద్యం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ నుంచి సరఫరా అయినట్లు భావిస్తున్నారు. సాగర్ జిల్లా బందా తహసీల్‌లోని పలు గ్రామాల వారు శనివారం రాత్రి ఈ మద్యం తాగి అస్వస్థత పాలయ్యారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. వారందరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే 12 మంది మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. అధికారులు ఘటన జరిగిన ప్రాంతంలోని 7 మద్యం షాపులను మూసివేసి, వాటిలోని మద్యం నమూనాలను పరీక్షకు పంపిం ది. ముగ్గురు ఎక్పైజ్ అధికారులను, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం ఘటనపై న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ డిమాండ్ చేశారు.