మధ్యప్రదేశ్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:16 AM
మధ్యప్రదేశ్ సీఎంగా నా పదవికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం ఓ రాజీనామా లేఖతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా గిరిజన చిన్నారులు ఇటీవల మరణించారు.
మధ్యప్రదేశ్‌లో 30మంది గిరిజన
చిన్నారుల మరణాలపై దీప్కే వ్యంగ్య లేఖ
భోపాల్, సెప్టెంబరు 13: ‘‘మధ్యప్రదేశ్ సీఎంగా నా పదవికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం ఓ రాజీనామా లేఖతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా గిరిజన చిన్నారులు ఇటీవల మరణించారు. దీంతో దీప్కే శనివారం ఆయా ప్రాంతంలో పర్యటించి, బాధిత చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. మోహన్‌యాదవ్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. ఒక వ్యంగ్య రాజీనామా లేఖను (రాష్ట్ర గవర్నర్‌ను ఉద్దేశించి) అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. అచ్చం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక లెటర్ హెడ్‌ను ఇది పోలి ఉండడం గమనార్హం. ‘‘బాలాఘాట్ జిల్లాలో 30 మందికి పైగా గిరిజన చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈ పదవిలో కొనసాగేందుకు నా అంతరాత్మ అంగీకరించడం లేదు. సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే చాలా మంది ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. ఈ బాధ్యతల్లో నేను విఫలమయ్యాను. మధ్యప్రదేశ్ ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు’’అని లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ ఘటనపై కీలక పరిణామం.. కేటీఆర్ పీఏ, పీఆర్ఓకు నోటీసులు
కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ