Share News

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్

ABN , Publish Date - May 17 , 2026 | 02:23 PM

మరో ఎల్‌పీజీ ట్యాంకర్ భారత్‌కు చేరుకుంది. మే 13న హోర్ముజ్‌ జలసంధిని దాటిన ఈ ట్యాంకర్ తాజాగా కాండ్లా పోర్టుకు చేరుకుంది.

భారత్‌కు చేరుకున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్
LPG Tanker Symi Reaches Kandla Port

ఇంటర్నెట్ డెస్క్: మరో ఎల్‌పీజీ ట్యాంకర్ భారత్‌కు తాజాగా చేరుకుంది. 23 వేల టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌తో వచ్చిన ట్యాంకర్ గుజరాజ్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ ట్యాంకర్ మే 13న హోర్ముజ్ జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. దేశీయంగా ఇంధన ధరలు పెరగడంతో ఆహార ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుతో పలు రెస్టారెంట్స్‌లో ఆహారాల ధరలు 47 శాతం మేర పెరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని ఫారెక్స్ నిల్వలు కాపాడుకునేందుకు ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఇంధన వినియోగంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శుక్రవారం ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించారు. దేశీయంగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల పెంపు, రక్షణ రంగం సహకారం, దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరా దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

వాహనదారులపై ఇంధన భారం.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు

Updated Date - May 17 , 2026 | 02:29 PM