Share News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు.. లోక్‌సభ రేపటికి వాయిదా

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:07 PM

నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ సమావేశాన్ని కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా వేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు.. లోక్‌సభ రేపటికి వాయిదా
Loksabha Adjourned

ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభను కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ ఉదంతానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది. పేపర్ లీక్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరిస్తే వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.


రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరుతుంటే ప్రభుత్వం అంగీకరించట్లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే తాము ఏ చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. నీట్‌పై చర్చ నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. చర్చ ముందు షరతులు పెట్టడం భావ్యం కాదని అన్నారు. ఈ అంశంపై తన వాదన వినిపించే హక్కు ప్రభుత్వానికి కూడా ఉంటుందని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..

విద్యార్థులతో కేంద్రం చర్చలు జరపాలి: ప్రియాంక గాంధీ

Updated Date - Jul 23 , 2026 | 03:36 PM