Share News

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:31 AM

తమ ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ నిబంధనలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగిన నేపథ్యంలో ప్రముఖ కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్‌ కొత్త స్టైల్‌ గైడ్‌ను విడుదల....

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: తమ ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ నిబంధనలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగిన నేపథ్యంలో ప్రముఖ కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్‌ కొత్త స్టైల్‌ గైడ్‌ను విడుదల చేసింది. బిందీ (నుదిటిపై సిందూరం), తిలకం, హిజాబ్‌, తలపాగా.. అన్నింటిని స్వాగతిస్తామని ప్రకటించింది. ‘మా బృంద సభ్యులు పాటించే ఆచార వ్యవహారాలను గౌరవిస్తాం. సంస్కృతికి చిహ్నాలైన బిందీ, తిలకం, మంగళసూత్రం, కడా, హిజాబ్‌, తలపాగా మొదలైన వాటిని నిస్సందేహాంగా స్వాగతిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది. అయితే అంతకుముందు.. పాత స్టైల్‌ గైడ్‌లో ఉద్యోగులు హిజాబ్‌ ధరించడానికి అనుమతినిచ్చి.. హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకం వంటి వాటిని ధరించకూడదని పేర్కొనడంపై లెన్స్‌కార్ట్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. లెన్స్‌కార్ట్‌ను నిషేధించాలంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పిలుపునిచ్చారు. అయితే అది పాత స్టైల్‌ గైడ్‌ అంటూ లెన్స్‌కార్ట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూశ్‌ బన్సల్‌ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 05:31 AM