Share News

సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు.. ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ..

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:25 PM

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమే లలిత్ మోదీతో సుస్మిత సన్నిహితంగా మెలుగుతోందని గతంలో ఆరోపణలు వచ్చాయి.

సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు.. ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ..
Lalit Modi, Sushmita Sen

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమే లలిత్ మోదీతో సుస్మిత సన్నిహితంగా మెలుగుతోందని గతంలో ఆరోపణలు వచ్చాయి. 2022లో తమ బంధం వెలుగులోకి వచ్చిన తర్వాత సుస్మితపై అనేక విమర్శలు వచ్చాయని, అయితే వాటిలో ఎలాంటి నిజమూ లేదని లలిత్ స్పష్టం చేశారు (Lalit Modi Sushmita Sen dating).


'సుస్మిత వద్ద ఈ ప్రపంచంలో చాలా మందికంటే ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. అవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకున్నవే. ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మేము కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఒక్కసారి కూడా నేను బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి రాలేదు. బిల్లులన్నీ తనే చెల్లించేది. నేను ఆమె డబ్బులపై ఆధారపడే వాడిని. ఆమె ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించదు' అంటూ లలిత్ మోదీ వ్యాఖ్యానించారు (Gold digger controversy).


సుస్మిత తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని, ప్రస్తుతం ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉన్నామని లలిత్ మోదీ తెలిపారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి సుస్మితనే కారణమని, తాను ఎదగడానికి ఆమె ఎంతో సహాయపడిందని, తమది చాలా ప్రత్యేకమైన బంధమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 02 , 2026 | 01:27 PM