మార్కెట్లోకి కియా సొరెంటో
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:16 AM
కియా ఇండియా.. ప్రీమియం ఎస్‌యూవీ సొరెంటోను మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది.
ప్రారంభ ధర రూ. 27.99 లక్షలు
న్యూఢిల్లీ: కియా ఇండియా.. ప్రీమియం ఎస్‌యూవీ సొరెంటోను మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. హైబ్రిడ్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈఎస్‌యూవీ ప్రారంభ ధరలు రూ.27.99 లక్షల నుంచి రూ.40.39 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి. 1.6 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, 65 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో తీసుకువచ్చింది. ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ), లెవల్ 2+ ఏడీఏఎస్, పనోరోమిక్ సన్‌రూఫ్, రిమోట్ పార్కింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లతో సొరెంటోను రూపొందించింది. టయోటా ఫార్చూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ మోడళ్లకు ఈ వాహనం గట్టి పోటీనిస్తుందని అంచనా.
100శాతంఇథనాల్‌తో కియా సైరోస్
ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కియా ఇండియా.. సైరోస్ ఫ్లెక్స్-ప్యూయల్ వెహికల్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్ కోసం కియా తీసుకువచ్చిన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనం ఇదే. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్వచ్ఛమైన పెట్రోల్, 100 శాతం ఇథనాల్ లేదా రెండింటి మిశ్రమంతో నడిచేలా రూపొందించింది. కియా సైరోస్‌లో వివిధ స్థాయిల్లో ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా పనిచేసేలా ఇంజన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ), ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ), ఫ్యూయల్ సిస్టమ్‌లో అవసరమైన మార్పులు చేశారు.