Share News

కేతన్‌కు బట్టతల.. విగ్గు పెట్టుకునే వాడు!

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:26 AM

పుణె యువ వ్యాపారవేత్త కేతన్‌ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్‌కు బట్టతల ఉండటం, అతడు విగ్గు పెట్టుకుంటాడన్న నిజం తెలిసి...

కేతన్‌కు బట్టతల.. విగ్గు పెట్టుకునే వాడు!

  • అది నచ్చకనే వదిలించుకునేందుకు చంపేశానన్న సియా

పుణె, జూన్‌ 26: పుణె యువ వ్యాపారవేత్త కేతన్‌ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్‌కు బట్టతల ఉండటం, అతడు విగ్గు పెట్టుకుంటాడన్న నిజం తెలిసి కాబోయే భార్య సియా.. అతడితో పెళ్లికి ఇష్టపడలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే క్రమంలో పెళ్లిని ఆపేందుకు తాను ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికే ఆ సమయం దాటిపోయిందని కేతన్‌ అన్నట్లు సియా తెలిపింది. కుటుంబ పరువు కోసం పెళ్లి ఇష్టం లేకపోయినా మౌనంగా ఉన్నానని.. చివరకు అతడిని వదిలించుకునేందుకే హత్యకు పాల్పడినట్లు సియా చెప్పిందని సమాచారం. అయితే సియా వాదనను కేతన్‌ తండ్రి విశాల్‌ అగర్వాల్‌ ఖండించారు. కేతన్‌కు తలపై ఓ ప్రాంతంలో జుట్టు రాలడంతో చిన్న హెయిర్‌ ప్యాచ్‌ వాడేవాడని.. ఈ విషయాన్ని నిశ్చితార్థానికి ముందే సియా కుటుంబానికి చెప్పామని తెలిపారు. సమస్య ఉంటే ముందే చెబితే పెళ్లి రద్దు చేసుకునేవాళ్లమన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 06:26 AM