Share News

కేతన్ మర్డర్ తర్వాత సైన్ లాంగ్వేజ్‌లో సియా, చేతన్ చాటింగ్..

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:19 PM

పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీల డిలీటెడ్ మొబైల్ డేటాను పోలీసులు రికవర్ చేశారు.

కేతన్ మర్డర్ తర్వాత సైన్ లాంగ్వేజ్‌లో సియా, చేతన్ చాటింగ్..
Ketan Agarwal murder case

ఇంటర్‌నెట్ డెస్క్: పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీల డిలీటెడ్ మొబైల్ డేటాను పోలీసులు రికవర్ చేశారు. ఆ డేటా ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. కేతన్‌ను మర్డర్ చేసిన తర్వాత సియా, చేతన్‌లు సోషల్ మీడియాలో సైన్ లాంగ్వేజ్‌లో చాటింగ్ చేసుకున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇద్దరూ నిక్ నేమ్స్ పెట్టుకుని మరీ చాటింగ్ చేసుకున్నారు.


దర్యాప్తు అధికారి మనోజ్ పవార్ మాట్లాడుతూ.. ‘కేతన్ పాస్‌పోర్టును సియా చించేసిన చోట పంచనామా నిర్వహించాము. ఆమె దుస్తుల్ని సీజ్ చేశాము. సియాకు చెందిన రెండో ఫోన్‌లో సైన్ లాంగ్వెజ్‌లో చేసుకున్న చాట్‌లను గుర్తించాము’ అని తెలిపారు. మరో వైపు సియా తన స్నేహితురాలితో స్నాప్‌చాట్‌లో చేసిన చాట్ తాలూకా స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చాట్‌లో ... ‘ఎప్పటికీ జరగని పెళ్లి కోసం టికెట్ బుక్ చేయడానికి నీ ఆధార్ కార్డును పంపించు’ అని సియా తన స్నేహితురాలితో అంది.


ప్లాన్‌లో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సియా తన స్నేహితురాలికి విమాన టికెట్ బుక్ చేయాలని చూసిందా? అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయని అందరికీ అనిపించేలా ఈ విధంగా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చేతన్‌ను చంపిన తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు.. ఆ చాట్‌కు కేసుకు సంబంధం ఉందా? ఆ చాట్ నిజమా కాదా తెలుసుకునే పని పడ్డారు.


ఇవి కూడా చదవండి

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..

అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్‌కు చెప్పండి: పార్థివ్ పటేల్

Updated Date - Jul 04 , 2026 | 06:46 PM