ప్రధాని, ఈసీఐలపై ఏఐ వీడియో.. ‘ఎక్స్’పై కేసు
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:22 AM
ప్రధాని మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పరువు తీసేలా, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఏఐతో చిత్రీకరించిన...
తిరువనంతపురం, మార్చి 26: ప్రధాని మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పరువు తీసేలా, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఏఐతో చిత్రీకరించిన ఫేక్ వీడియోను పంచుకున్నందుకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’తో పాటు ఓ ఖాతాదారుడిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీఐతో పాటు అధికార వర్గాల దృష్టికి ఈ వీడియో వెళ్లిందని.. కీలక ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఈ వీడియోను రూపొందించినట్లు కేరళ సైబర్ క్రైం విభాగం పేర్కొంది. తిరువనంతపురంలో లక్ష్మి ఎన్ రాజు అనే ఎక్స్ యూజర్‌తో పాటు ఎక్స్ కార్ప్ సహా పలువురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు ఆ వీడియోను తక్షణమే తొలగించాలంటూ ‘ఎక్స్’కు నోటీసులు జారీ చేశామన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..