Share News

కేరళలో నిపా వైరస్‌ కలకలం.. ఒకరికి పాజిటివ్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:37 AM

కేరళలో నిపా వైరస్‌ కలకలం రేపుతోంది. కోజికోడ్‌కు చెందిన 43ఏళ్ల వ్యక్తికి జరిపిన పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట...

కేరళలో నిపా వైరస్‌ కలకలం.. ఒకరికి పాజిటివ్‌

కోజికోడ్‌, జూన్‌ 11: కేరళలో నిపా వైరస్‌ కలకలం రేపుతోంది. కోజికోడ్‌కు చెందిన 43ఏళ్ల వ్యక్తికి జరిపిన పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చేరిన సదరు రోగిని.. బుధవారం కోజికోడ్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తరలించారని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. తాజా పరిస్థితిపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. బాధిత వ్యక్తి చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలోని పలు విభాగాలను వెళ్లాడని, ఆ సమయంలో రోగితో కాంటాక్ట్‌ అయిన 77 మంది వివరాలు సేకరించామని అధికారులు తెలిపారు. కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారెవరికీ ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. వారిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:37 AM