Share News

ఉజ్బెకిస్థాన్‌లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:17 AM

ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థే...

ఉజ్బెకిస్థాన్‌లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య

న్యూఢిల్లీ, జూలై 10: ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. తనను మతం మార్చుకోవాలని నిందితుడు ఒత్తిడి తీసుకువచ్చాడని, అందుకు నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడాడ్డని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్‌ పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని అలపుళ జిల్లా హరిపాడ్‌కు చెందిన సవారియా బసంత్‌ (21), మలప్పురం జిల్లాకు చెందిన సదరుల్‌ అనం (22) ఇద్దరూ ఉజ్బెకిస్థాన్‌లోని ‘బుఖారా స్టేట్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 3న వీరిద్దరి మధ్య హాస్టల్‌ గదిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సదరుల్‌.. ల్యాప్‌టా్‌పతో సవారియాపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 06:17 AM