Share News

3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి తెర

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:54 AM

కేరళం, అసోంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి మంగళవారం...

3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి తెర

  • రేపటి పోలింగ్‌కు సర్వం సిద్థం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కేరళం, అసోంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5గంటలకు తెరపడింది. ఈ 3 రాష్ట్రాల్లోనూ ఈ నెల 9న పోలింగ్‌ జరగనున్నది. కేరళంలో 140 స్థానాల పరిధిలోని 30,471 పోలింగ్‌ కేంద్రాలు, అసోంలోని 126 స్థానాల్లోని 31,486, పుదుచ్చేరిలోని 30 స్థానాల్లోని 1,099 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో ఏప్రిల్‌ 23న, బెంగాల్‌లో ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరగనుంది. 5 రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ను ఏప్రిల్‌ 26 సాయంత్రంవరకు వెల్లడించవద్దని ఈసీ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:54 AM