కాన్పూర్‌లో దారుణం.. కోడలిపై మామ దాడి.. వీడియో వైరల్!
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:19 PM
కాన్పూర్‌లోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆనంద్ నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు తన కోడలిపై అతి దారుణంగా దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: కాన్పూర్‌లోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆనంద్ నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు తన కోడలిపై అతి దారుణంగా దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తిని ఆనంద్ నగర్‌కు చెందిన సుశీల్ దుబేగా పోలీసులు గుర్తించారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. కాన్పూర్‌లోని చకేరి ప్రాంతంలోని ఆనంద్ నగర్‌కు చెందిన సుశీల్ దుబే.. తన కోడలిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. ఆమె సహాయం కోసం కేకలు వేస్తుండగా, జుట్టు పట్టుకొని బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో సుశీల్‌ని ఓ యువతి ఆపే ప్రయత్నం చేసింది. గేటు బయటకు వచ్చిన సుశీల్.. మళ్లీ ఇంట్లోకి వెళ్లి కోడలిపై దాడికి పాల్పడ్డాడు. సుశీల్ తన కొడుకుకు మరో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండటంతో కోడలు నిలదీసింది. దీంతో ఆమెపై దాడి చేసి, బయటకు పంపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవడంతో.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే.. మరో వీడియోలో బాధితురాలు మాట్లాడుతూ.. తనను బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తోంది. ఆమె తన చేతిపై గాయాలను చూపిస్తూ, తనపై కుట్ర జరుగుతోందని కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియోలు చూసిన ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్ పోలీసులు స్పందిస్తూ.. ‘ఈ కేసులో చకారి పోలీస్ స్టేషన్‌కు లిఖితపూర్వక అందిన ఫిర్యాదు ఆధారంగా.. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశాం. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..
తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..