Share News

కమల్ బాబీ మర్డర్ కేసు.. పంజాబ్ పోలీసుల అదుపులో అమృత్ పాల్..

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:18 AM

పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ బాబీ మర్డర్ కేసులో పంజాబ్ పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుడు అమృత్ పాల్‌ను యూఏఈ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు.

కమల్ బాబీ మర్డర్ కేసు.. పంజాబ్ పోలీసుల అదుపులో అమృత్ పాల్..
Kamal Bhabhi case

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ బాబీ మర్డర్ కేసులో పంజాబ్ పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుడు అమృత్ పాల్‌ను యూఏఈ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ మేరకు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఓవర్సీస్ పుజిటివ్ అండ్ అండ్ ఎక్స్‌ట్రాడిషన్ సెల్ (ఓఎఫ్‌టీఈ‌సీ) మెహ్రాన్‌ను ఇండియాకు తీసుకువస్తోందని తెలిపారు.


కేసు వివరాలు..

పంజాబ్‌‌కు చెందిన కమల్ కౌర్‌ అలియాస్ కాంచన్ కుమారికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కమల్ కౌర్ భాబీ’ పేరిట అకౌంట్ ఉండేది. సోషల్ మీడియాలో లక్షల మంది ఆమెను ఫాలో అయ్యేవారు. కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వైరల్ అవుతుండేది. గత ఏడాది జూన్ 8వ తేదీన నిందితుడు నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ .. కమల్ కౌర్‌ను కాంటాక్ట్ అయ్యాడు. బతిందలో వాహనాల ప్రమోషన్ ఉందని ఆమెను నమ్మించాడు. జూన్ 9వ తేదీన కమల్ వాహనాల ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి లుథియానా వెళ్లింది. ఆ తర్వాతి నుంచి కనిపించకుండా పోయింది. జూన్ 11వ తేదీన కారులో శవమై తేలింది.


కమల్ కౌర్‌ను తానే హత్య చేశానని నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ ప్రకటించాడు. అయితే, హత్య తర్వాత అతడు యూఏఈ పారిపోయాడు. ఇదే కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొగకు చెందిన జస్‌ప్రీత్ సింగ్, తార్న్ తరణ్‌కు చెందిన నిమ్రత్ జిత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఏఈలో ఉన్న మెహ్రాన్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫార్మాలిటీస్ పూర్తవటంతో పంజాబ్ పోలీసులు అతడిని ఇప్పుడు యూఏఈ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అతీతశక్తులంటూ మోసం.. మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

ఈ వ్యక్తుల మధ్య అస్సలు మాట్లాడకూడదు

Updated Date - Apr 10 , 2026 | 11:29 AM