Share News

జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి.. వడదెబ్బ తగలదు

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:36 AM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజలకు ఓ సలహా ఇచ్చారు...

జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి.. వడదెబ్బ తగలదు

  • కేంద్ర మంత్రి సింధియా సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. వడదెబ్బ తగలకుండా జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని, తాను ఇదే చిట్కా పాటిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపురిలో సభలో మాట్లాడుతూ ఈ సలహా ఇచ్చిన ఆయన తన జేబులో పెట్టుకున్న ఉల్లిపాయను తీసి చూపించారు. తాను కారులో ఏసీ వాడనని, ఏసీ గదుల్లో కూర్చోనన్నారు. ‘మే, జూన్‌ నెలల్లో 51 డిగ్రీల ఎండలను కూడా మీరు ఎలా తట్టుకుంటారని ప్రజలు అడిగనప్పుడు ‘ఇది చంబల్‌ స్కిన్‌ (చర్మం)’ అని చెబుతుంటా. మీరు కూడా జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి. మీకేం కాద’ని చెప్పారు. ‘జూన్‌లో ఎండలు 52 డిగ్రీలు దాటినా సరే.. తలపై వస్త్రం కప్పుకోండి.. జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి. దేవుణ్ణి తల్చుకుని ముందుకెళ్లండ’ని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 06:36 AM