Share News

ఈసీలోని విభేదాలను బయటపెట్టిన జర్నలిస్ట్‌ రితికా చోప్రాకు టైమ్‌ మ్యాగజైన్‌ గుర్తింపు

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:53 AM

ఎన్నికల సంఘం (ఈసీ)లోని అంతర్గత విభేదాలను, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్‌)పై ఎన్నికల కమిషనర్ల అ భ్యంతరాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు రితికా చోప్రాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈసీలోని విభేదాలను బయటపెట్టిన జర్నలిస్ట్‌ రితికా చోప్రాకు టైమ్‌ మ్యాగజైన్‌ గుర్తింపు
rithika

న్యూఢిల్లీ, నవంబర్‌ 19: ఎన్నికల సంఘం (ఈసీ)లోని అంతర్గత విభేదాలను, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్‌)పై ఎన్నికల కమిషనర్ల అ భ్యంతరాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు రితికా చోప్రాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ తొలిసారిగా ప్రకటించిన ‘టైమ్‌ 100 నెక్స్ట్‌ ఇండియా- 2026’ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ముంబై ఎడిషన్‌ చీఫ్‌గా పనిచేస్తున్న రితికా.. తన పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. సర్‌ సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ సెప్టెంబరు 23నాటి కథనం ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల సంఘం పారదర్శకతపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రే గింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.

Updated Date - Nov 20 , 2026 | 07:04 AM