జగన్నాథునికి 60,821 ఎకరాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:59 AM
పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఆస్తులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన(ఎస్‌జేటీఏ) ప్రకటించింది. పలు బ్యాంకుల్లో మొత్తం రూ.1912 కోట్లు ఉండగా, ఆలయం పేరుతో పలు రాష్ట్రాల్లో 60,821 ఎకరాల భూమి ఉంది.
బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు.. ప్రకటించిన ఎస్‌జేటీఏ
పూరి, సెప్టెంబరు 3: పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఆస్తులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన(ఎస్‌జేటీఏ) ప్రకటించింది. పలు బ్యాంకుల్లో మొత్తం రూ.1912 కోట్లు ఉండగా, ఆలయం పేరుతో పలు రాష్ట్రాల్లో 60,821 ఎకరాల భూమి ఉంది. వీటికి రత్న భండార్‌లో నిక్షిప్తం చేసిన బంగారు, డైమండ్ ఆభరణాలు అదనం. భక్తులు ఇచ్చే డొనేషన్లు, గుడికి ఉన్న స్వంత క్వారీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, భూ క్రయ విక్రయాల వల్ల సమకూరే సొమ్ములు, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా ఈ డబ్బులు సమకూరినట్లు ఎస్‌జేటీఏ ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధీ ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమర్పణ్’ పేరుతో డిజిటల్ డొనేషన్ ప్లాట్‌ఫాంను ప్రారంభించామని, ఆగస్టు 31 నాటికి దాని ద్వారా రూ.56.71లక్షలు వచ్చాయని చెప్పారు. ఆలయం పేరుతో ఉన్న భూమిలో 60,426 ఎకరాలు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విస్తరించి ఉండగా, మిగిలిన 395 ఎకరాల భూమి పశ్చిమ బెంగాల్‌తో సహా ఆరు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: సీఎం రేవంత్
మీడియా ముందుకు వచ్చి.. మీసం తిప్పిన కొండా మురళి