Share News

ఈ నెలాఖరులో జీ‌ఎస్ఎల్వీ-ఎఫ్‌ 17

ABN , Publish Date - May 14 , 2026 | 05:33 AM

ఈ నెలాఖరులో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 17 రాకెట్‌ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా 1,117 కిలోల బరువు కలిగిన ఈవోఎస్‌-05 భూ...

ఈ నెలాఖరులో జీ‌ఎస్ఎల్వీ-ఎఫ్‌ 17

సూళ్లూరుపేట, మే 13(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 17 రాకెట్‌ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా 1,117 కిలోల బరువు కలిగిన ఈవోఎస్‌-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మే 18న ప్రయోగించిన పీ‌ఎస్ఎల్వీ-సీ 61, ఈ ఏడాది జనవరి 12న ప్రయోగించిన పీ‌ఎస్ఎల్వీ-సీ 62 రాకెట్ల వైఫల్యాలతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు నెలల విరామం తరువాత ఈవోఎస్‌-05 ఉపగ్రహ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి అనుసంధాన భవనంలో రాకెట్‌ అనుసంధాన పనులు శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:33 AM