Share News

ఐఆర్‌జీసీ నౌకాదళ కమాండర్‌ అలీరెజా మృతి

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:18 AM

తమ దాడుల్లో ఐఆర్‌జీసీ నావికాదళం కమాండర్‌ అలీరెజా టాంగ్సిరి మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ గురువారం ప్రకటించింది. ఇరాన్‌ రేవుపట్టణమైన...

ఐఆర్‌జీసీ నౌకాదళ కమాండర్‌ అలీరెజా మృతి

న్యూఢిల్లీ, మార్చి 26: తమ దాడుల్లో ఐఆర్‌జీసీ నావికాదళం కమాండర్‌ అలీరెజా టాంగ్సిరి మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ గురువారం ప్రకటించింది. ఇరాన్‌ రేవుపట్టణమైన బందర్‌ అబ్బా్‌సలో చేసిన వైమానిక దాడుల్లో ఆయనతోపాటు ఇరాన్‌ నేవీకి చెందిన కీలక అధికారులు కూడా మరణించినట్టు తెలిపింది. అలీరెజా టాంగ్సిరి సుమారు పదేళ్లుగా ఆధునికీకరణ, సరికొత్త సాంకేతికతల వినియోగంతో ఐఆర్‌జీసీ నావికా దళాలను బలోపేతం చేశారు. చిన్న నౌకల ద్వారా డ్రోన్ల ప్రయోగించే వ్యవస్థలను అభివృద్ధి చేయించారు. ఇరాన్‌ తరఫున హోర్ముజ్‌ జలసంధిని నియంత్రించే కీలక బాధ్యతలను ఆయనే చూసుకుంటున్నారు. జలసంధి మూసివేత, నౌకలపై నిఘా, దాడులు, సముద్రపు మందుపాతరల(సీమైన్స్‌) ఏర్పాటు, వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతులు వంటివన్నీ అలీరెజా పర్యవేక్షించారని ఇజ్రాయెల్‌ రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగంగా.. అమెరికా, ఇరాన్‌ మధ్య సందేశాలను చేరవేస్తున్నామని పాక్‌ విదేశాంగమంత్రి ఇషాక్‌దార్‌ వెల్లడించారు. తుర్కియే, ఈజి్‌ప్టతోపాటు మరికొన్ని దేశాలు సహకరిస్తున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 06:19 AM