ఇజ్రాయెల్ అణుకేంద్రంపై ఇరాన్ దాడి
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:55 AM
ఇరాన్ గురువారం కూడా ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రధాన కమాండ్ సెంటర్, అణు వ్యవస్థలపై...
న్యూఢిల్లీ, మార్చి 26: ఇరాన్ గురువారం కూడా ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రధాన కమాండ్ సెంటర్, అణు వ్యవస్థలపై దాడులు చేసినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది. హైఫా పోర్టులోని ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్టు తెలిపింది. గురువారం తమపైకి ప్రయోగించిన 15 క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ వెల్లడించింది. వాటి శకలాలు పడి అబుధాబిలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు భారతీయుడు అని అబుధాబి అధికారులు తెలిపారు. ఒక భారతీయుడు సహా మరో ముగ్గురికి గాయాలైనట్టు వెల్లడించారు. మొత్తంగా పశ్చిమాసియా ఘర్షణల్లో మృతిచెందిన భారతీయుల సంఖ్య ఏడుకు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 1,937కు పెరిగిందని ఇరాన్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..