‘తవజ్జో.. తవజ్జో‘.. రహస్య సందేశం
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:44 AM
తమ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్‌పై ముమ్ముర దాడులు చేస్తున్న ఇరాన్.. అమెరికాలోని తమ ‘స్లీపర్ సెల్స్’ను యాక్టివేట్ చేసిందా...
పర్షియన్ కోడ్‌లో రహస్య సందేశం
అమెరికాలో ఇరాన్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్?
న్యూఢిల్లీ, మార్చి 18: తమ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్‌పై ముమ్ముర దాడులు చేస్తున్న ఇరాన్.. అమెరికాలోని తమ ‘స్లీపర్ సెల్స్’ను యాక్టివేట్ చేసిందా..!? అంటే.. అమెరికా నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ మేరకు పర్షియన్ కోడ్.. ర్యాండమ్ నంబర్లతో కూడిన ఎన్‌క్రిప్టెడ్ రేడియో సిగ్నల్స్‌ను గుర్తించాయి. గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించిన కొద్దిసేపటికే.. ఒక ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్‌ను అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రాథమిక సంకేతాల విశ్లేషణలో ఇది ఇరాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు.
తమ స్లీపర్ సెల్స్‌ను అప్రమత్తం చేయడానికి ఈ సందేశం పంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ‘అనెన్షన్.. అటెన్షన్..’ అర్థం వచ్చేలా ‘తవజ్జో.. తవజ్జో..’ అనే పర్షియన్ పదం గత నెల 28న ఖమేనీ హత్య జరిగిన కొద్దిసేపటికే రేడియో ఫ్రీక్వెన్సీలో వినిపించింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ర్యాండమ్‌గా కొన్ని నంబర్లను చదివి వినిపించాడు. ఇరాన్ వెలుపల ఉన్న తమ సీక్రెట్ ఏజెంట్లు, స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసేందుకే ఈ సందేశం పంపి ఉండొచ్చని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ట్రంప్ కూడా గతవారం ఇరాన్ స్లీపర్ సెల్స్ గురించి హెచ్చరించారు. ‘అమెరికాలో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్‌లో ఎక్కువ మంది ఎక్కడున్నారో మాకు తెలుసు. వారందరిపైనా నిఘా ఉంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..