Share News

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:58 AM

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు!
insta

న్యూఢిల్లీ, అక్టోబరు 27: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా రీల్స్‌ వంటి చిన్న వీడియోలకే ప్రాధాన్యమిచ్చిన సంస్థ.. ఇకపై 90 నిమిషాల నిడివి గల వీడియోలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ‘ఫీచర్స్‌’ పేరుతో కొత్త ఫార్మాట్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫార్మాట్‌లో క్రియేటర్లు 90 నిమిషాల వరకు నిడివి గల హారిజాంటల్‌ (అడ్డంగా ఉండే) వీడియోలను అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ సరికొత్త అప్‌డేట్‌లో భాగంగా చిన్న రీల్స్‌ను పూర్తి నిడివి గల వీడియోలకు అనుసంధానించవచ్చు. ఉదాహరణకు, ఒక పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన చిన్న రీల్‌ను చూసిన వినియోగదారులు దానిపై క్లిక్‌ చేసి పూర్తి ఎపిసోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బ్రెజిల్‌, అమెరికాలోని కొంతమంది పరిమిత క్రియేటర్లతో మాత్రమే టెస్ట్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు.

Updated Date - Oct 28 , 2026 | 06:41 AM