రైళ్లలో రాత్రి వేళ నో చార్జింగ్
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:54 AM
రాత్రివేళల్లో మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ పాయింట్లను స్విచ్‌ఆఫ్ చేయాలంటూ 2014లో ఇచ్చిన ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని రైల్వే బోర్డు ఆదేశించింది
రైళ్లలో రాత్రి వేళ నో చార్జింగ్
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు
అన్ని జోన్లకూ లేఖ రాసిన రైల్వే బోర్డు
రైళ్లలో రాత్రివేళల్లో చార్జింగ్ పాయింట్లు స్విచ్‌ఆఫ్ చేయండి
న్యూఢిల్లీ, అక్టోబరు 28: రాత్రివేళల్లో మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ పాయింట్లను స్విచ్‌ఆఫ్ చేయాలంటూ 2014లో ఇచ్చిన ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. ఈమేరకు అక్టోబరు 26న అన్ని జోన్లకు ఒక లేఖను రాసింది. ఆగ్నేయ రైల్వే జోన్‌లో ముంబయి లోకల్ రైలులో ఓ ప్రయాణికుని పవర్ బ్యాంకు పేలి బోగీ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ ఘటనతో బోర్డు అప్రమత్తమైంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ చార్జింగ్ పాయింట్లను స్విచ్‌ఆఫ్ చేయాలని ఆదేశించింది. సంబంధిత సిబ్బంది ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరింది.