Share News

తుది దశకు భారత్‌- అమెరికా ట్రేడ్‌ డీల్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:15 AM

భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దీనిపై మధ్యంతర ఒప్పందం...

తుది దశకు భారత్‌- అమెరికా ట్రేడ్‌  డీల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దీనిపై మధ్యంతర ఒప్పందం ఖరారు కాగా, పూర్తిస్థాయి బీటీఏలో న్యాయపరమైన అంశాలపై చర్చలు జరిపేందుకు భారత ప్రతినిధి బృందం ఈ నెల 23న అమెరికా వెళ్లనుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగ్రవాల్‌ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌ తరఫున చర్చల ప్రధాన ప్రతినిధి, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి దర్పన్‌ జైన్‌ నేతృత్వంలో వెళ్లనున్న ఈ ప్రతినిధి బృందం, అమెరికా ప్రతినిధులతో బీటీఏ న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 06:15 AM