ఐదేళ్లలో 120 జిల్లాల్లో డ్రైవింగ్ స్కూళ్లు గడ్కరీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:08 AM
రహదారి భద్రత, ఉపాధి కల్పనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు....
న్యూఢిల్లీ, మార్చి 26: రహదారి భద్రత, ఉపాధి కల్పనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఏడీపీ(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రొగ్రామ్, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం) కింద ఎంపికైన 120 జిల్లాలతోపాటు 500 వెనుకబడిన ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటి ద్వారా కోటి మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 22 లక్షల మంది డ్రైవర్లకు కొరత ఉందని ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..