బంగ్లాదేశ్‌లో ఆయిల్ కొరత.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా చేసిన భారత్
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:36 AM
ఇండియా - బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ ఇన్సియేటివ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌కు భారత్ డీజిల్ సరఫరా చేస్తోంది. 2017లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి ఈ డీజిల్ సరఫరా అవుతోంది.
న్యూఢిల్లీ, మార్చి 11: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆయిల్ సంక్షోభం తలెత్తింది. అక్కడి జనం పెట్రోల్, డీజిల్ కొరతతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో బంగ్లాదేశ్‌ను ఆదుకోవడానికి భారత్ ముందుకొచ్చింది. 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా ఒప్పందంలో భాగంగా.. మంగళవారం 5 వేల టన్నుల డీజిల్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢాకా ధ్రువీకరించింది. ఇండియా నుంచి డీజిల్ అందుకున్నామని తెలిపింది. మరింత డీజిల్ సరఫరా చేయమని అడిగినట్లు వెల్లడించింది.
బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పోరేషన్ (బీపీసీ) చైర్మన్ మొహమ్మద్ రెజరానుర్ రహమ్మాన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఇండియాతో మాకు అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం.. పైప్ లైన్ ద్వారా ఇండియా ప్రతీ ఏడాది బంగ్లాదేశ్‌కు 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా చేస్తుంది. ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం మంగళవారం 5 వేల టన్నుల డీజిల్ సరఫరా అయింది. ఆరు నెలల్లో అందాల్సిన మొత్తం 90 వేల టన్నుల డీజిల్ ఇంకో రెండు నెలల్లోనే అందుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు.
కాగా, ఇండియా - బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ ఇన్సియేటివ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌కు భారత్ డీజిల్ సరఫరా చేస్తోంది. 2017లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి ఈ డీజిల్ సరఫరా అవుతోంది. అయితే, యుద్ధం కారణంగా డీజిల్ కొరత ఏర్పడటంతో మరింత ఎక్కువ మొత్తంలో డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఆయిల్ సంక్షోభం నుంచి బయపడేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టింది. మంగళవారం నుంచి పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీలు బంద్ అయ్యాయి. ఆయిల్ సేల్స్‌పై కూడా ప్రభుత్వం లిమిట్ పెట్టింది.
ఇవి కూడా చదవండి
తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..
హోర్ముజ్ జలసంధి సమీపంలో దాడి.. 16 ఇరాన్ మైన్‌లేయర్స్ ధ్వంసం..