Iran Protests: ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల తరలింపునకు కేంద్రం సిద్ధం
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:27 PM
చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తుల ఫలితం.. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్ అగ్నిగుండంలా మారిపోతోంది. ఇరాన్ ప్రజలు ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, జనవరి 15: ఇరాన్‌లో కొనసాగుతున్న భారీ నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో మొదటి విడత భారతీయులను రేపే విమానాల్లో తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, భద్రతా పరంగా ప్రమాదంలో ఉన్నారని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ (MEA) ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. భారతీయులు నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే అందుబాటులో ఉన్న విమానాల ద్వారా ఇరాన్ విడిచి రావాలని సూచించింది.
ఇండియన్ ఎంబసీ, టెహ్రాన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేపడతామని కేంద్రం తెలిపింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇరాన్‌లో పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో భారతీయుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News