Share News

దేశ వ్యాప్తంగా జన గణన ప్రారంభం

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:51 AM

ప్రపంచంలోనే అత్యంత భారీ జనాభా లెక్కల ప్రక్రియ ఆరంభమయింది. ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే ఈ ప్రక్రియ వాస్తవానికి 2021లో జరగాల్సింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల...

దేశ వ్యాప్తంగా జన గణన ప్రారంభం

  • 140 కోట్ల మంది కోసం 30 లక్షల మంది సిబ్బంది

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: ప్రపంచంలోనే అత్యంత భారీ జనాభా లెక్కల ప్రక్రియ ఆరంభమయింది. ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే ఈ ప్రక్రియ వాస్తవానికి 2021లో జరగాల్సింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఆలస్యమయింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు... సుమారుగా 6.40 లక్షల గ్రామాల్లోని ప్రతి ఇంటి తలుపు తట్టడానికి జనాభా లెక్కల అధికారులు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియలో మొత్తం 30 లక్షల మంది సిబ్బంది... ప్రధానంగా ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. సుమారుగా 140 కోట్ల మంది వివరాలను వీరు సేకరిస్తారు. ఏడాదిపాటు సాగే ఈ ప్రక్రియకు సుమారుగా రూ.12,068 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. తొలి దశలో 5రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. తొలిసారిగా జనాభా లెక్కల సేకరణను డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యాప్‌ను రూపొందించారు. ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి వెబ్‌ ఆధారిత పోర్టల్‌నూ సిద్ధం చేశారు. ఈ మొత్తం ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఇళ్లు, ఇంటి స్థితిగతులను నమోదు చేస్తారు. రెండో దశలో ప్రజల జీవన ప్రమాణాలు, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులపై దృష్టి సారిస్తారు. ఈ రెండో దశలోనే కుల గణన కూడా చేపడతారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 05:51 AM