భారత ఆర్మీ చేతికి ఆత్మాహుతి డ్రోన్స్
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:03 PM
భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ తాజాగా సైన్యానికి వందలకొద్దీ ఆత్మాహుతి డ్రోన్స్‌ను సరఫరా చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్స్ కీలకంగా మారాయి. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికీ డ్రోన్స్ చేరుకున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. శత్రుమూకలకు వెన్నులో వణుకు పుట్టించే ఆత్మాహుతి డ్రోన్స్‌ను (కామెకాజీ డ్రోన్స్) గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ సైన్యానికి తాజాగా అప్పగించింది. వీటి కోసం రూ.10 కోట్లకు గతంలో ఆర్మీ ఒప్పందం కుదర్చుకోగా తాజాగా వందల సంఖ్యలో ఈ డ్రోన్‌లను ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ డెలివరీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఒప్పందం కుదరగా అత్యవసర ప్రాతిపదికన నెలల వ్యవధిలోనే కంపెనీ ఈ డ్రోన్స్‌ను సరఫరా చేసింది. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో కూడా పనిచేసేలా ఈ డ్రోన్స్‌ను డిజైన్ చేశామని సంస్థ వెల్లడించింది. యుద్ధ స్థలంలోని పరిస్థితులను రియల్‌టైమ్‌లో తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ తయారీకి కూడా ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ పేరుగాంచింది.
ఏమిటీ కామెకాజీ డ్రోన్స్
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఏఐ ఆధారిత గైడెన్స్ వ్యవస్థ ఉన్న ఈ డ్రోన్స్ 2.5 కిలోల వరకూ పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్స్ 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. సంప్రదాయక దళాలు చేరుకోలేని ప్రాంతాల్లో అత్యధిక రిస్క్ ఉన్న మిషన్స్ కోసం వీటిని వినియోగిస్తారు. శత్రుదేశంలోని లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంగా వేగంగా దాడి చేసేందుకు ఈ డ్రోన్స్‌ను ప్రధానంగా వినియోగిస్తారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు