Share News

ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్‌ నుంచి భారత్‌కు క్రూడాయిల్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:37 AM

కాలమే కొన్ని పరిస్థితులకు సమాధానం చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. ఇరాన్‌ నుంచి ఆయిల్‌ కొనడానికి వీల్లేదంటూ భారత్‌పై ఏడేళ్ల క్రితం ఆంక్షలు విధించిన అమెరికా.....

ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్‌ నుంచి భారత్‌కు క్రూడాయిల్‌

  • 6 లక్షల బ్యారెళ్ల చమురుతో వస్తున్న నౌక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: కాలమే కొన్ని పరిస్థితులకు సమాధానం చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. ఇరాన్‌ నుంచి ఆయిల్‌ కొనడానికి వీల్లేదంటూ భారత్‌పై ఏడేళ్ల క్రితం ఆంక్షలు విధించిన అమెరికా.. ఇప్పుడు యుద్ధం కారణంగా వచ్చిన ఇంధన సంక్షోభంతో ఆ ఆంక్షలను సడలించింది. దీంతో ఇరాన్‌ నుంచి నేరుగా భారత్‌ క్రూడాయిల్‌ కొనడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి 6 లక్షల బ్యారెళ్ల చమురుతో బయలుదేరిన నౌక ఈనెల 4న గుజరాత్‌లోని వాదినార్‌ పోర్టుకు చేరనుంది. కెప్లర్స్‌ రియల్‌టైమ్‌ మెరైన్‌ ట్రాఫిక్‌ డేటా ప్రకారం.. ఆఫ్రికా దేశమైన ఎస్వటినీ జెండాతో పింగ్‌ షున్‌ అనే చమురు నౌక భారత్‌ వైపు వస్తోంది. అగ్రరాజ్యం ఆంక్షలు విధించాక 2019 మే నెల తర్వాత ఇరాన్‌ నుంచి నేరుగా మన దేశం ఆయిల్‌ కొనడం ఇదే ప్రథమం. మన దేశం ఇంధన వనరుల సేకరణలో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:37 AM