Share News

యుద్ధం వల్ల 10వేలకు పైగా విమానాల రద్దు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:30 AM

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షలు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి...

యుద్ధం వల్ల 10వేలకు పైగా విమానాల రద్దు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షలు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలు 10 వేలకు పైగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సాధారణ రోజుల్లో పశ్చిమాసియా దేశాలకు భారత్‌ నుంచి రోజుకు 300 నుంచి 350 విమానాలు నడుస్తుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 90కి పడిపోయిందని పౌర విమానయాన శాఖ జాయింట్‌ సెక్రటరీ అసాంగ్బా చూబా ఆవో తెలిపారు. మరోవైపు, సుదూర ప్రయాణాలతో పాటు పైలట్ల కొరతను అధిగమించేందుకు డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌’ నిబంధనలను సడలించి, పైలట్ల విధి నిర్వహణ సమయాన్ని పెంచింది. ఈ సడలింపు ఈనెల 30 వరకు అమల్లో ఉంటుందని, తర్వాత పరిస్థితిని బట్టి సమీక్షిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమాన లాండింగ్‌, పార్కింగ్‌ చార్జీలను 25ు తగ్గిస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్‌ టారిఫ్‌ రెగ్యులేటర్‌ ఎయిర్‌ ఎకనామిక్‌ రెగ్యులేటర్‌ అథారిటీ (ఏఈఆర్‌ఏ) మంగళవారం ప్రకటించింది. మూడు నెలల పాటు ఇది అన్ని దేశీయ విమానాలకు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:30 AM