Share News

6 కోట్ల బ్యారెళ్ల రష్యన్‌ చమురు కొనుగోలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:17 AM

రష్యా నుంచి భారత్‌ ఆరు కోట్ల బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. ఈ సరుకు వచ్చే నెలలో డెలివరీ కానుందని...

6 కోట్ల బ్యారెళ్ల రష్యన్‌ చమురు కొనుగోలు

  • ఒక్కో బ్యారెల్‌పై 5-15 డాలర్లు అధికంగా చెల్లింపు

న్యూఢిల్లీ, మార్చి 25: రష్యా నుంచి భారత్‌ ఆరు కోట్ల బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. ఈ సరుకు వచ్చే నెలలో డెలివరీ కానుందని సంబంధిత అధికార వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వార్తాసంస్థ పేర్కొంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధరల కంటే ఒక్కో బ్యారెల్‌కు 5 డాలర్ల నుంచి 15 డాలర్ల వరకూ అధికంగా చెల్లించి ఈ చమురును బుక్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ పరిమాణం ప్రస్తుత నెలలో భారత్‌ చేసిన కొనుగోళ్లకు దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో చేసిన కొనుగోళ్ల కంటే రెట్టింపు అని ప్రముఖ డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘కెప్లర్‌’ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:17 AM