భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:29 AM
భారత్-న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎ్‌ఫటీఏ) కుదిరింది. దాదాపు పదేళ్లపాటు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత్-న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎ్‌ఫటీఏ) కుదిరింది. దాదాపు పదేళ్లపాటు ఈ విషయంపై ఇరు దేశాలు చర్చించాయి. అనంతరం.. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్ క్లేల సమక్షంలో సోమవారం ఇరు దేశాల అధికారులు ఎఫ్‌టీఏపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్.. ‘‘ఒక తరంలో ఒకసారి మాత్రమే కుదిరే ఒప్పందం.’’ అని అభివర్ణించారు. కేంద్ర వాణిజ్య మంత్రి గోయెల్ మాట్లాడుతూ.. భారత్‌లో న్యూజిలాండ్ వ్యాపారాలకు అపార అవకాశం కల్పించడంతోపాటు నిబంధనలను సరళీకృతం చేసేందుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేథ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, క్లీన్ ఎనర్జీ సహా మొత్తం 20 అంశాల్లో ఈ ఒప్పందం ప్రధాన భూమిక పోషించనుంది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం