ఇమ్రాన్ ఆరోగ్యంపై స్పందించండి
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:26 AM
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై మాజీ క్రికెట్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఆయన అనారోగ్యం పాలయ్యారన్న వార్తల నేపథ్యంలో...
పాక్ ప్రభుత్వానికి భారత దిగ్గజ క్రికెటర్ల లేఖ
న్యూఢిల్లీ, లాహోర్, ఫిబ్రవరి 17: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై మాజీ క్రికెట్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఆయన అనారోగ్యం పాలయ్యారన్న వార్తల నేపథ్యంలో సునిల్ గవాస్కర్, కపిల్‌దేవ్ సహా 12 మంది మాజీ కెప్టెన్‌లు స్పందించారు. ఇమ్రాన్‌కు అవసరమైన వైద్య చికిత్స అందించాలని వారంతా పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. పాకిస్థాన్‌కు వరల్డ్ కప్ అందించిన జట్టుకు సారథ్యం వహించిన ఇమ్రాన్‌ఖాన్ కుడి కన్ను దాదాపు 85ు చూపు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో మాజీ కెప్టెన్లంతా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. 800 రోజుల నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ