Share News

ఐఫోన్‌ 18కు ఫుల్‌ క్రేజ్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:21 AM

యాపిల్‌ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ కోసం దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు భారత్‌లో ఈ రెండు మోడళ్ల సాధారణ విక్రయాలు ప్రారంభమయ్యాయి.

ఐఫోన్‌ 18కు ఫుల్‌ క్రేజ్‌
I PHONE

తెల్లవారుజాము నుంచే యాపిల్‌ స్టోర్ల వద్ద జనం బారులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: యాపిల్‌ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ కోసం దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు భారత్‌లో ఈ రెండు మోడళ్ల సాధారణ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, నోయిడా, గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లోని యాపిల్‌ స్టోర్ల వద్ద తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు కనిపించాయి. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చి గంటల తరబడి వేచి ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ఓ కొనుగోలుదారు నోయిడాలో ఉదయం 6 గంటలకే క్యూలో నిల్చొని రెండు ప్రో మ్యాక్స్‌18 ఫోన్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఐఫోన్‌ 18 ప్రో ప్రారంభ ధర రూ.1,64,900 కాగా ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,79,900గా యాపిల్‌ ప్రకటించింది. కెమెరా, బ్యాటరీ, పనితీరు, ఏఐ సామర్థ్యాల్లో భారీ అప్‌గ్రేడ్లు చేసినట్లు సంస్థ తెలిపింది. తొలిసారిగా భారత్‌లో తయారైన ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లు విడుదల రోజునే అందుబాటులోకి వచ్చాయి. ఫాక్స్‌కాన్‌, టాటా గ్రూప్‌ స్థానిక తయారీకి కీలకంగా వ్యవహరించాయి.

Updated Date - Sep 19 , 2026 | 04:25 AM