Share News

వన్యప్రాణి ప్రవేశ, నిష్క్రమణ పోర్టుగా హైదరాబాద్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:00 AM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపునిచ్చింది. వన్యప్రాణులు, వాటి ఉత్పత్తులకు..

వన్యప్రాణి ప్రవేశ, నిష్క్రమణ పోర్టుగా హైదరాబాద్‌

  • కేంద్ర ప్రభుత్వం అరుదైన గుర్తింపు

న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపునిచ్చింది. వన్యప్రాణులు, వాటి ఉత్పత్తులకు సంబంధించి అధికారిక ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతం (పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌)గా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం- 1972లోని సెక్షన్‌ 49హెచ్‌ (4) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. 2023 ఆగస్టు 8న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణ చేస్తూ.. కేంద్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్టు (వైల్డ్‌లైఫ్‌) అండ్‌ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌ పాండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఉన్న జాబితాలో 21వ క్రమసంఖ్యను తాజాగా 22 చేసి హైదరాబాద్‌, తెలంగాణ అంశాన్ని కొత్తగా చేర్చారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌ కేంద్రంగా వన్యప్రాణులు, వాటికి సంబంధించిన అధికారిక దిగుమతి, ఎగుమతులకు మార్గం సుగమమైంది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 07:00 AM