హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి 11 మంది భారతీయులకు గాయాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:29 AM
పనామా పతాకంతో ఉన్న వాణిజ్య నౌకపై మంగళవారం ఉదయం హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 6: పనామా పతాకంతో ఉన్న వాణిజ్య నౌకపై మంగళవారం ఉదయం హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ‘‘వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బంది, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు ముగింపు పలకాలి. అదేవిధంగా అంతర్జాతీయ జలమార్గంలో పూర్వస్థితిని పునరుద్ధరించాలి.’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ‘ఎమ్.టీ. ఆన్ పీస్’.. వాణిజ్య నౌకపై దాడి జరిగిన సమయంలో 19 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారని కేంద్రం తెలిపింది. వీరిలో 11మంది గాయపడ్డారని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్