Share News

యుద్ధం మొదలయ్యాక హోర్ముజ్‌ నుంచి

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:22 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్‌ కట్టడి...

యుద్ధం మొదలయ్యాక హోర్ముజ్‌ నుంచి

ఒక్క ఎల్‌ఎన్‌జీ నౌక కూడా దాటి రాలేదు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్‌ కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా వాణిజ్యం, ముడిచమురు, ఇతర ఇంధనాల సరఫరాకు విఘాతం ఏర్పడుతోంది. యుద్ధం మొదలై వారాలు గడుస్తున్నప్పటికీ ధ్రవీకృత సహజ వాయువు (ఎన్‌ఎన్‌జీ)తో కూడిన ఒక్క నౌకను కూడా హోర్ముజ్‌ జలసంధి గుండా వెళ్లడానికి ఇరాన్‌ అనుమతించలేదని రవాణాలో పాలుపంచుకుంటున్న ట్రేడర్లు చెబుతున్నారు. ఈ నిషేధం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఎన్‌జీ కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఖతార్‌ ఎల్‌ఎన్‌జీతో కూడిన రెండు ట్యాంకర్లు సోమవారం పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి బయలుదేరినట్టు కనిపించినా కొన్ని గంటల్లోనే వెనక్కి తిరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇరాన్‌ అధికారులు అనుమతులు నిరాకరించడం వల్లనే ఇది జరిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:22 AM