Share News

పిచ్చివాడిలా ఖర్గే మాటలు హిమంత

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:57 AM

పవన్‌ ఖేరా ఇంట్లో సోదాలపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ప్రజా ప్రయోజనం కోసం కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే కూడా అస్సాం సీఎం వణికిపోతున్నారని జైరాం రమేశ్‌...

పిచ్చివాడిలా ఖర్గే మాటలు హిమంత

పవన్‌ ఖేరా ఇంట్లో సోదాలపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ప్రజా ప్రయోజనం కోసం కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే కూడా అస్సాం సీఎం వణికిపోతున్నారని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా.. కేసును ధైర్యంగా ఎదుర్కొంటామని, అయితే, రింకీ మీద వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ వంటి కేంద్రసంస్థలు దర్యాప్తు జరిపి అసలు విషయం ఏమిటో తేల్చాలని డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాలపై హిమంతబిస్వశర్మ స్పందిస్తూ.. ‘అస్సాం పోలీసులు ఎలాంటివారో మీకు తెలియదు. పవన్‌ఖేరా పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకొస్తారు. తప్పుడు పత్రాలతో మా కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేయటానికి ఖేరా ఆరోపణలు చేశారు. దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్‌ విసిరిన పవన్‌ ఖేరా ఇప్పుడు హైదరాబాద్‌కు పారిపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘ఖర్గేకు వయసు పెరుగుతోంది. అందువల్లే పిచ్చివాడిలా మాట్లాడుతున్నారు. ఆయనేమైనా (పవన్‌ ఖేరా) మీకు అల్లుడా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 126 స్థానాల అస్సాం శాసనసభకు గురువారం ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:57 AM