నదిలో కొట్టుకుపోయిన 3వేల గ్యాస్ సిలిండర్లు
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:42 AM
మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. పలు చోట్ల నష్టాలను...
మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లా పాతాళగంగలో ఘటన
ముంబై, సూరత్, డెహ్రాడూన్, జూలై 9: మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. పలు చోట్ల నష్టాలను మిగిల్చాయి. వరదల కారణంగా రాయ్‌గడ్ జిల్లాలో ఏకంగా 3వేల గ్యాస్ సిలిండర్లు పాతాళగంగ నదిలో కొట్టుకుపోయాయి. హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన పాతాళగంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంటు ప్రహరీ కూలి వరద నీరు ప్రవేశించడంతో అందులోని సిలిండర్లన్నీ నదిలోకి, సమీపంలోని ఖర్పడ మడుగులోకి కొట్టుకుపోయాయి. వీటిలో కొన్ని ఖాళీవికాగా, గ్యాస్‌తో నింపినవి కూడా ఉన్నాయి. గుజరాత్‌లోనూ కొద్దిరోజులుగా భారీ వర్షాలు నష్టాలు కలిగిస్తున్నాయి. ఒక్క సూరత్ జిల్లాలోనే ఇప్పటివరకు 17 మంది మరణించారు. సూరత్ నగరంలో గురువారం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లో 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఏడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కొండచరియలు కూలిన కారణంగా 107 మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..