Share News

హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళల దుర్మరణం

ABN , Publish Date - Mar 07 , 2026 | 06:27 PM

హర్యానాలోని ఒక రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు.

హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళల దుర్మరణం
Haryana factory fire

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని ఒక హోలీ రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కార్మికులు మరణించగా 20 మంది గాయాలపాలయ్యారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలోగల భట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది.

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరిగిందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్మాగారానికి బయటి నుంచి లాక్ వేసి ఉండటంతో కార్మికులు అక్కడి నుంచి బయటపడలేక ఇబ్బంది పడ్డారట. కొందరు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయినట్టు తెలిసింది. ఇక ప్రమాద సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించారు. వారిని సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలూ చదవండి:

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం

Updated Date - Mar 07 , 2026 | 06:48 PM