రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:46 AM
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంపీ ఒకరు డిప్యూటీ చైర్మన్ కావడం ఇదే తొలిసారి...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంపీ ఒకరు డిప్యూటీ చైర్మన్ కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో ఆయన డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికవడం వరుసగా మూడోసారి కూడా. రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు జేపీ నడ్డా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించాక మూజువాణి ఓటుతో హరివంశ్ గెలిచినట్లు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. హరివంశ్‌కు ప్రధాని మోదీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. సభ గౌరవాన్ని నిలబెడతానని, సభ్యుల హక్కులు కాపాడతానని, సభ సజావుగా సాగేలా చూస్తానని హరివంశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..