పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:02 PM
ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్న విధానంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్న విధానంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ శాతాన్ని మరింత పెంచే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయట్లేదని స్పష్టం చేశారు. శాస్త్రసాంకేతిక అధ్యయనాలు, సంబంధిత వర్గాలతో పూర్తిస్థాయి సంప్రదింపుల తరువాత ఇథనాల్ శాతాన్ని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఆటోమొబైల్ తయారీదార్లు, ఆయిల్ మార్కెటింగక్ కంపెనీలు, పరిశోధన సంస్థలతో చర్చి్స్తామని అన్నారు. ఈ మేరకు మంత్రి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ20 పెట్రోల్ విషయంలో తాము అనుకున్న సమయానికి కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని అన్నారు. 2013-14 మధ్య కాలంలో 1.53 శాతంగా ఉన్న సగటు ఈథనాల్ బ్లెండింగ్ ప్రస్తుతం 20 శాతానికి చేరుకుందని చెప్పారు.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానంతో అనేక ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు చేకూరాయని అన్నారు. ముడిచమురు దిగుమతల్లో కోత పడిందని ఫలితంగా, రూ. 1.97 ట్రిలియన్లకు పైగా మాదకద్రవ్యం ఆదా అయ్యిందని అన్నారు. 952 లక్షల టన్నుల కర్బన్ ఉద్గారాలు కూడా తగ్గాయని కూడా చెప్పారు. ఈ విధానంతో దేశీయ రైతులకు అదనంగా రూ.1.66 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు.
ఈ20 పెట్రోల్‌తో వాహన సామర్థ్యం తగ్గుతుందన్న భయాలపై కూడా మంత్రి స్పందించారు. ఈ విషయమై తమకు వాహనతయారీదార్లు, ఆటోమొబైల్ అసోసియేషన్లు, లేదా వినియోగదారుల అసోసియేషన్స్ నుంచి ఇంజిన్, ఫ్యూల్ పంప్, నీటి కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఏమీ రాలేదని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వాట్సాప్‌లో సైబర్ మోసం.. రూ. 10 లక్షలు పోగొట్టుకున్న అటవీ అధికారి..
అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుపై ట్రస్ట్ కీలక నిర్ణయం