జీవితకాలంతోపాటు రోగాలూ పెరిగాయి..!
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:18 AM
ప్రజల ఆరోగ్యకరమైన జీవితకాలం కంటే సగటు ఆయుర్దాయం వేగంగా పెరుగుతోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాధులు, వైకల్యాలతో బాధపడుతూ...
1990 నుంచి పెరుగుతున్న ప్రజల అనారోగ్య కాలం
న్యూఢిల్లీ, జూలై 22: ప్రజల ఆరోగ్యకరమైన జీవితకాలం కంటే సగటు ఆయుర్దాయం వేగంగా పెరుగుతోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాధులు, వైకల్యాలతో బాధపడుతూ జీవితంలో ఎక్కువ సమయాన్ని అనారోగ్యంతో గడుపుతున్నారని తాజా అధ్యయనం గుర్తించింది. దీనివల్ల అనారోగ్య వ్యత్యాసం మరింత పెరిగిందని పేర్కొంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నర్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. 1990లో మొత్తం ఆయుర్దాయం, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం మధ్య వ్యత్యాసం 8.8 ఏళ్లుగా ఉండగా.. 2023 నాటికి అది 10.7 సంవత్సరాలకు పెరిగింది. అంటే 1990 నుంచి చాలా దేశాల్లో ప్రజల అనారోగ్యకాలం పెరుగుతోందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితకాలంలో అనారోగ్యంతో గడిపే సగటు సమయం 13.6 శాతం (1990) నుంచి 14.5 శాతానికి (2023) పెరిగింది. భారత్‌లోనూ అనారోగ్య కాలం 1990లో 8.4 ఏళ్లు ఉండగా.. 2023 నాటికి అది 10.7 ఏళ్లకు పెరిగిందని ఈ అధ్యయనం గుర్తించింది.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..