రైలు ఆలస్యం కారణంగా పరీక్ష మిస్.. ఏడేళ్ల న్యాయపోరాటం తర్వాత..
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:10 PM
రైలు ఆలస్యం కారణంగా ఓ యువతి జీవితం తల్లకిందులు అయింది. ఎంతో ముఖ్యమైన పరీక్షను రాయలేకపోయింది. దీంతో ఆ యువతి న్యాయపోరాటానికి దిగింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఏమైందంటే..
లక్నో, జనవరి 29: రైలు ఆలస్యం కారణంగా ఓ యువతి జీవితం తలకిందులైంది. ఎంతో ముఖ్యమైన పరీక్షను ఆమె రాయలేకపోయింది. దీంతో ఆ యువతి న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలంటూ కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆ యువతికి న్యాయం జరిగింది. కన్స్యూమర్ కమిషన్ ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. జరిగిన నష్టానికి పరిహారంగా ఏకంగా రూ.9.1 లక్షలు ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన సమృద్ధి అనే యువతి 2018లో బీఎస్‌సీ డిగ్రీ చదువుతుండేది. అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు. 2018 మే 7వ తేదీన ఆమె బీఎస్ఈ బయోటెక్నాలజీ పరీక్ష రాయడానికి లక్నోలోని జై నారాయణ్ పీజీ కాలేజీకి బయలుదేరింది. ఉదయం లక్నో వెళ్లడానికి బస్తీలో గోరఖ్‌పూర్-లక్నో ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఉదయం 6.55 గంటలకు బస్తీ వచ్చిన రైలు.. 11 గంటలకు లక్నో చేరుకోవాల్సి ఉంది.
అయితే, రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా.. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత లక్నోకు చేరుకుంది. దీంతో ఆమె బయోటెక్నాలజీ పరీక్ష రాయలేకపోయింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేకపోవంతో సదరు యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్‌ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. 2018 నుంచి న్యాయ పోరాటం చేస్తోంది. తాజాగా, సమృద్ధికి.. కమిషన్ సానుకూలంగా తీర్పునిచ్చింది. యువతికి రూ.9.1 లక్షలు పరిహారంగా ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో బల్లిని 15 సెకెన్లలో కనిపెట్టండి..
మహిళా పోలీస్ కమాండోను కొట్టి చంపిన భర్త! గర్భవతి అని తెలిసీ..