ఫ్రాన్స్‌లో కార్చిచ్చు ‘రఫేల్’ తయారీ కేంద్రానికి ముప్పు
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:47 AM
ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశ రక్షణ రంగానికి ముప్పుగా మారుతోంది. అణు కేంద్రాలతోపాటు రక్షణ రంగానికి...
న్యూఢిల్లీ, జూలై 29: ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశ రక్షణ రంగానికి ముప్పుగా మారుతోంది. అణు కేంద్రాలతోపాటు రక్షణ రంగానికి చెందిన కీలక పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి మంటలు చేరువయ్యాయి. రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం, ఎం51 జలాంతర్గాములు ప్రయోగించే అణు బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన విడి భాగాల తయారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలోనే మంటలు ఉన్నాయి. జూలై 22న మొదలైన కార్చిచ్చు వల్ల ఫ్రాన్స్‌లో 42,000 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్